నిజామాబాద్, జూలై 14
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన 'ఆపరేషన్ ముస్కాన్'లో భాగంగా వర్ని చౌరస్తాలోని ఓ ఆటో ఎలక్ట్రికల్ దుకాణంలో బాల కార్మికుడిని గుర్తించారు. ఎం.డి. ఇస్మాయిల్ అనే బాలుడు అక్కడ పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు.
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆపరేషన్ ముస్కాన్' కార్యక్రమంలో భాగంగా మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ హెల్ప్‌లైన్ అధికారులు వర్ని చౌరస్తాలోని ఓ ఆటో ఎలక్ట్రికల్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా దుకాణంలో ఓ బాలుడు బాల కార్మికుడిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎం.డి. ఇస్మాయిల్ అనే బాలుడు ఆటో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నట్లు నిర్ధారించారు.
దీనిపై దుకాణ యజమాని షేక్ ఇర్షాద్ (తండ్రి: షేక్ రహీం), నగారం గ్రామానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం టౌన్–5 పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సునీల్‌కు అప్పగించి, సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.












