సంగారెడ్డి, జూలై 13
గోదావరి– బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సూట్ లోపభూయిష్టంగా ఉండటంతో కొట్టివేయబడిందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.
గోదావరి– బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సూట్ లోపభూయిష్టంగా ఉండటంతో అది కొట్టి వేయబడిందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. గోదావరి–బనకచర్ల, గోదావరి–నల్లమల సాగర్ అంశాలపై బీఆర్ఎస్ మొదటి నుంచే హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కంటే ఆంధ్రప్రదేశ్‌కు పరోక్షంగా సహకరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణం ద్వారా బీఆర్ఎస్ హయాంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.
తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను బీఆర్ఎస్ సహించదని, రాష్ట్ర ప్రజల నీటి హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.












