నగరంలో ఫిట్నెస్ మరియు రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కామారెడ్డి ప్రమో రన్ 2026 శనివారం విజయవంతంగా ముగిసింది. ఇందిరా గాంధీ స్టేడియంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
స్థానిక కామారెడ్డి SHO నరహరి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు RK జైపాల్ రెడ్డి, పున్న రాజేశ్వర్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రన్నర్స్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి రన్ డైరెక్టర్ జ్యోత్స్న, పున్న రాజేష్ ల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గజ్వేల్ రన్నర్స్‌కు చెందిన నిఖిల్ రెడ్డి, జనార్ధన్, విద్యార్థులు, NCC, NSS సభ్యులు కూడా నిర్వహణలో పాలుపంచుకున్నారు.
ఈ రన్లో 2కె ఫ్యామిలీ రన్, 5కే ఫన్ రన్, 10కే ప్రధాన రన్ వంటి విభాగాలలో యువత, కుటుంబాలు, ఫిట్నెస్ ఆసక్తిగల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారికి టీ-షర్టులు, ఫినిషర్ మెడల్స్, అల్పాహారం మరియు ఇతర సౌకర్యాలు కల్పించారు.
అవంతిక కన్స్ట్రక్షన్స్, మెడ్వన్ హాస్పిటల్స్, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్, కామారెడ్డి వంటి సంస్థలు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా సహకరించాయి. పాల్గొన్న వారికి అల్పాహార ఏర్పాటును బాంబే క్లాత్ హౌస్ నిర్వహించింది.
ఈ కార్యక్రమం ద్వారా నగర ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, రన్నింగ్ పట్ల ఆసక్తిని పెంపొందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమో రన్, జూన్ 7న హైదరాబాద్‌లో జరగనున్న అవంతిక తెలంగాణ రన్ 2026కి ప్రొత్సహకంగా నిర్వహించబడింది.











