ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా, కార్మికుల హక్కుల కోసం, వారి శ్రమకు గుర్తింపు కోసం పోరాడిన మహానుభావులకు నివాళులు అర్పించారు. చెమట చుక్కకు గుర్తింపుగా, కార్మికుల 8 గంటల పని దినం కోసం జరిగిన ఐక్య పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
కార్మిక, కర్షక రైతాంగం తరపున సుత్తి, కొడవలి, కలం గుర్తులతో ఏర్పడిన ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, ప్రపంచ కార్మికుల ఐక్యత కోసం పోరాడిన వీరులకు విప్లవాభివందనాలు తెలిపారు. కార్మికుల కడుపు కొడుతూ లాభాలు గడిస్తున్న భూస్వాములను ఎదిరించి, కార్మికుల ఐక్యత కోసం మే డేను జరుపుకుంటున్న అన్ని సంఘాల, అన్ని వర్గాల కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పేదల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, కామ్రేడ్ ధర్మ బిక్షం, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, మద్ది కాయల ఓంకార్, సోయబుల్లా ఖాన్, నర్రా రాఘవరెడ్డి, నంద్యాల శ్రీనివాసరెడ్డి, మారోజు వీరన్న వంటి అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
నాటి తరం ఎర్రజెండాను భుజాన వేసుకుని కార్మికుల కోసం పోరాడిన అమరవీరులకు, నేటికీ ఎర్రజెండాను భుజాలపై మోస్తూ పోరాడుతున్న నాయకులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. తరాలు మారినా, ఎన్ని జెండాలు మారినా కార్మిక పోరాటం మాత్రం ఆగదని, ఎర్రజెండా ఎప్పటికీ ఎరుపుగానే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.











