సంగారెడ్డి, జూలై 31
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. సంగారెడ్డి పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, రెజింతల్ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు వంటి అంశాలపై ఆయన కలెక్టర్‌తో చర్చించారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే సదాశివపేట మండలం రెజింతల్ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. గ్రామంలో ప్రస్తుతం శ్మశానవాటిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సర్వే నెం.149లోని ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు.
అనంతరం రెవెన్యూ శాఖలో చాలా లాంగ్ పెండింగ్‌లో ఉన్న వివిధ దరఖాస్తులు, భూ సంబంధిత సమస్యల పరిష్కార పురోగతిపై జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే వినతులపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, మధుసూదన్ రెడ్డి, చీల మలన్న, లక్ష్మారెడ్డి, మజీద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.











