జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రజావాణిలో అందిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు సానుకూల దృక్పథంతో స్వీకరించాలని, క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











