ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిసి బస్టాండ్ లో డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలు ప్రయాణికుల క్షేమం కోసం నిర్వహించబడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అనుమాన స్థలాలను, హోటలులను మరియు బస్టాండ్లను తనిఖీ చేయడం జరిగింది.
ప్రయాణికులు మరియు ప్రజలు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ కోరారు.
ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, బస్సు వెక్కి క్రమంలో వాటిని పోగొట్టుకోకుండా ఉండాలని సూచించారు.

