సంగారెడ్డి, జూలై 29
ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) తదితర అంశాలపై ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటర్ల నుంచి సేకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు.
బీఎల్వోలు నమోదు చేసిన ప్రతి వివరాన్ని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు తప్పనిసరిగా ర్యాండమ్‌గా క్రాస్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. పరిశీలనలో ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సరిదిద్దాలని, అనంతరం కూడా తప్పిదాలు బయటపడితే సంబంధిత బీఎల్వోలు, సూపర్వైజర్లపై బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకుంటామన్నారు.
అన్ని స్థాయిల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎస్ఐఆర్ పురోగతిని వివరించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు సగటున 76.90 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ సంగీత, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.










