(సోమవారం) (ప్రశ్న ఆయుధం) జూలై 18
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 20వ తేదీన (సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటించారు. అదే రోజున జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన కీలక అంశాలపై సమీక్ష సమావేశం జరగనుంది.
ఈ నెల 20వ తేదీన (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎల్నినో ప్రభావం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, పంటల సాగు, గ్రౌండ్ వాటర్, విద్యుత్, తాగు నీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ-నియంత్రణ చర్యలు వంటి అంశాలపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
తదుపరి సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.












