జిన్నారం, జూలై 7
అర్హులైనప్రతిఒక్కఓటరుకుఎన్యూమరేషన్పారాలపంపిణీచేపట్టాలని,పొరపాట్లులేకుండాఓటర్లనమోదునిర్వహించాలనిజిల్లాఅదనపు అదనపు కలెక్టర్సంగీతఅన్నారు.మంగళవారంజిన్నారంలోనిర్వహిస్తున్నప్రత్యేకఓటరుసవరణనమోదుకార్యక్రమాన్నిఆమెపరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్క ఓటరుకు ఎన్యూమరేషన్ పారాల పంపిణీ చేపట్టాలని, పొరపాట్లు లేకుండా ఓటర్ల నమోదు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంగీత అన్నారు. మంగళవారం జిన్నారంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ నమోదు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సంగీత పరిశీలించారు. గ్రామాలలో పారాల పంపిణీ, ఓటరు నమోదు తీరుపై బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు.
పారిశ్రామిక ప్రాంతాల్లో స్థానికేతరుల ఓటర్ల గుర్తింపు ఇబ్బందిగా మారిందని బీఎల్ఓలు తెలుపగా, ప్రతి ఒక్కరికి నమోదు పారాలు పంపిణీ చేసి వివరాలు సేకరించాలని ఆమె సూచించారు. ఓటర్ల వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలని ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంథోనీ, మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.











