నిజామాబాద్, జూలై 28
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అపస్మారక స్థితిలో లభించిన ఓ గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుడి చేతిపై కన్నడ భాషలో 'పద్మ' అనే పేరు పచ్చబొట్టుగా ఉంది.
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అపస్మారక స్థితిలో లభించిన ఓ గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
రైల్వే అధికారుల వివరాల ప్రకారం.. జూలై 27న రాత్రి సుమారు 11 గంటల సమయంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్–2పై 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళ అపస్మారక స్థితిలో పడిఉండగా గమనించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూలై 28 ఉదయం 8.30 గంటలకు ఆమె మృతి చెందింది.
మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో ఆమె వివరాలు తెలియరాలేదు. అయితే ఆమె కుడి చేతిపై కన్నడ భాషలో "పద్మ" అనే పేరు పచ్చబొట్టుగా ఉంది.
ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎం. హన్మండ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డిని 8712658591 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.











