సంగారెడ్డి, జూలై 18
హైదరాబాద్‌లోని జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఖైదీల బ్యారక్‌లు, గదులు, వంటగది, జైలు ఆవరణను పరిశీలించి, వారికి అందిస్తున్న సదుపాయాలు, భోజనం గురించి ఆరా తీశారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా న్యాయమూర్తి సెంట్రల్ జైలులో ఉన్న బెరక్లూ, గదులు, వంటగది, మరియు జైలు ఆవరణ మొత్తాన్ని పరిశీలించారు. ఖైదీలను జైలులో ఉన్న సదుపాయాలు, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని ఖైదీల బెరక్లూలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్‌కు సూచించారు.
ఖైదీలకు సమయానికి బెయిల్స్, ములాఖత్‌లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారానికి న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు. ఖైదీలకు పెడుతున్న భోజనం రుచి చూసిన న్యాయమూర్తి, ఖైదీల కోసం కేటాయించిన కూరగాయలు, బియ్యం ఉన్న గదిని కూడా తనిఖీ చేశారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను కూడా పరిశీలించారు.
ఈ తనిఖీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్, న్యాయవాదులు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












