(టీజేఏ) (ప్రశ్న ఆయుధం) జూలై 18
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) జిల్లా కార్యవర్గ సమావేశం సంగారెడ్డిలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరంపల్లి అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జూలై 23న జరగనున్న టీజేఏ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కీలక కార్యక్రమాలను నిర్వహించాలని తీర్మానించారు.
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరంపల్లి అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 23న జరగనున్న టీజేఏ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కీలక కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పరీక్షల ప్యాడ్స్ పంపిణీ, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జూలై 23న జిల్లా కేంద్రంలో జరిగే ప్రధాన సమావేశానికి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులతో పాటు యువజన, స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) జిల్లా నాయకులు కూడా హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముజాహిద్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.అశోక్ బాబు, జిల్లా కార్యదర్శి జి.దశరత్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.చంద్రారెడ్డి, రామకృష్ణ, ఎం.మహిపాల్ రెడ్డి, పి.రాజు, జి.మల్లేష్, రమేష్, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.












