సంగారెడ్డి, జూలై 16
ఇక్రిశాట్ లో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా వేతనాలు రూ. 26,000/- పెంచాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, కార్మికులకు అన్యాయం చేస్తున్న కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షుడు అతిమేల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక్రిశాట్ లో పని చేస్తున్న కార్మికులకు పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా వేతనాలు రూ. 26,000/- పెంచాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, కార్మికులకు అన్యాయం చేస్తున్న కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షుడు అతిమేల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామచంద్రపురం మండలం ఇక్రిసశాట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు గత వారం రోజులుగా వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇక్రీశాట్ లో కార్మికులకు అన్యాయం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం నెలకు రూ. 15,000/- జీతాలు చెల్లిస్తున్నారని, పెరుగుతున్న ధరలతో ఇంటి కిరాయిలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భారంగా మారాయని అన్నారు.
కనీస వేతన చట్టం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్, డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పు, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని కనీస వేతనాలు రూ. 32,000/- ఉండాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వీటిని దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచడం లేదని, అయితే సిఐటియు మరియు కార్మిక సంఘాలు రూ. 26,000/- కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్రిశాట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంగారెడ్డి జిల్లా కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.












