సంగారెడ్డి జిల్లాలోని 298 అంగన్వాడీ కేంద్రాలలో ఆర్ఓ నీటి వడపోత యంత్రాల సరఫరా, బాలా పెయింటింగ్ పనుల కోసం జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి సీల్డ్ టెండర్లను ఆహ్వానించారు. ఈ పనులకు అంచనా వ్యయం రూ.74.50 లక్షలుగా నిర్ణయించారు.
జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఉన్న 298 అంగన్వాడీ కేంద్రాలకు ఆర్ఓ యంత్రాల సరఫరా, బాలా పెయింటింగ్ పనులు చేపట్టనున్నారు. దీనికోసం అర్హత కలిగిన ఏజెన్సీలు, వ్యాపారస్తుల నుండి టెండర్లు కోరుతున్నారు.
ఈ పనుల అంచనా వ్యయం రూ.74.50 లక్షలు. టెండర్ ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000తో పాటు, ఈఎండీగా మొత్తం అంచనా వ్యయంలో 2.5 శాతంలో 1 శాతాన్ని District Welfare Officer, Women, Children, Disabled and Senior Citizen’s Department, సంగారెడ్డి పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. ఈఎండీ, ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
టెండర్ ప్రకటన తేదీ మార్చి 11, 2026 కాగా, టెండర్ దరఖాస్తులను మార్చి 12, 2026 ఉదయం 11.30 గంటల వరకు స్వీకరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు టెండర్లను తెరవనున్నారు.
పూర్తి వివరాలను జిల్లా సంక్షేమ కార్యాలయంలో పొందవచ్చని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. ఈ చర్యల ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో తాగునీటి సౌకర్యం మెరుగుపరచడంతో పాటు, పిల్లల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.


