సంగారెడ్డి జిల్లాలోని 298 అంగన్వాడీ కేంద్రాలలో నీటి వడపోత యంత్రాల ఏర్పాటు, పెయింటింగ్ పనుల కోసం జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి టెండర్లను ఆహ్వానించారు. ఈ పనులకు సుమారు రూ.74.50 లక్షల వ్యయం అంచనా వేయబడింది.
జిల్లాలోని ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన తాగునీటిని అందించే లక్ష్యంతో RO యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు, కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు బాలా పెయింటింగ్ పనులు కూడా చేపట్టనున్నారు.
అనుభవజ్ఞులైన ఏజెన్సీలు, వ్యాపారస్తులు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు. టెండర్ ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000 తో పాటు, అంచనా వ్యయంలో 1 శాతం మొత్తాన్ని ఈఎండీగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
టెండర్ ప్రకటన మార్చి 11, 2026న వెలువడనుంది. దరఖాస్తులను మార్చి 13, 2026 ఉదయం 11.30 గంటల వరకు స్వీకరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు టెండర్లను తెరిచే ప్రక్రియ జరుగుతుంది.
ఈఎండీ చెల్లించని దరఖాస్తులు తిరస్కరించబడతాయని, ఈఎండీ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండవని జిల్లా సంక్షేమ అధికారి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం జిల్లా సంక్షేమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.


