జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NADCP) కింద సదాశివనగర్ గ్రామంలో ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు 255 పశువులకు టీకాలు వేశారు.
మండల పశువైద్యాధికారి డాక్టర్ రాంప్రసాద్, సర్పంచ్ వంకాయల శిరీష.రవి, ఉపసర్పంచ్ కుందేనా ప్రవీణ్, డైరీ ప్రెసిడెంట్ కొప్పుల లింగారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. FMD వ్యాధి పశువులలో ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని, దాని నివారణకు కేంద్ర ప్రభుత్వం NADCP కార్యక్రమాన్ని అమలు చేస్తోందని డాక్టర్ రాంప్రసాద్ వివరించారు.
ఈ వ్యాక్సినేషన్ FMD టీకా కార్యక్రమంలో 8వ దశలో భాగంగా చేపట్టబడింది. సుమారు 255 పశువులకు టీకాలు వేశారు.
పశువుల వివరాలు భారత్ పశుధన్ యాప్ ద్వారా నమోదు చేయబడ్డాయి. యజమానుల మొబైల్ నంబర్లకు OTP పంపించి డేటా పారదర్శకంగా ధృవీకరించబడింది.
ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గోపాల మిత్రులు పాల్గొన్నారు.











