నిజామాబాద్, జూలై 25
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలోని తన శిబిర కార్యాలయంలో శనివారం పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిశీలించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు.
నగరంలోని తన శిబిర కార్యాలయంలో శనివారం పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. టీయూఎఫ్ఐడీసీ నిధుల కింద రూ.60 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి డివిజన్‌కు రూ.1 కోటి చొప్పున నిధులు కేటాయించామని, త్వరలోనే అన్ని డివిజన్లలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
పనుల పురోగతిపై అధికారులు తరచూ సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సూచనలు ఇవ్వాలని, కొత్త అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే సూచించారు.
రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రూ.30 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అలాగే రైల్వే అండర్‌బ్రిడ్జిల (ఆర్యూబీ) నిర్మాణానికి రూ.60 కోట్లు, నాందేవ్‌వాడ వంతెన విస్తరణకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అమృత్–2 పథకం కింద మంజూరైన భూగర్భ మురుగునీటి (యూజీడీ) పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, డీఈ యోగేందర్, ఏఈ శంకర్, యూజీడీ ప్రాజెక్టు మేనేజర్ జయశంకర్, ఆర్అండ్బీ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.












