మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్‌ను జిల్లా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధుల బృందం బుధవారం కలిసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు అదనపు కలెక్టర్‌ను కోరారు.
జిల్లా జేఏసీ చైర్మన్ బి. రవి ప్రకాష్ నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించిన ప్రతినిధులు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలకు ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, ఉద్యోగులకు సహకరించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ సంఘాల విన్నపంపై అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సానుకూలంగా స్పందించారు. జిల్లా యంత్రాంగం తరపున ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వై. రమేశ్వర్ గౌడ్, బి. వెంకటేశ్వర్లు, ఎం. మధన్ రెడ్డి, ఎం. విఠల్, ఎం. శ్రీనివాస్, బి. భారత్ కుమార్, యాదగిరి, మహేష్, శ్రీనివాస్, నాచారయ్య, శ్రీనివాస్, కార్తిక్, అక్షయ్, ఉమాకాంత్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

