సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా అధికారి లలిత కుమారిని సన్మానించారు.
మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, మహిళా అధికారి లలిత కుమారిని మేమెంటో, సర్టిఫికెట్ అందజేసి ఘనంగా సన్మానించారు. మహిళల సాధికారత సమాజ పురోగతికి కీలకమని ఈ సందర్భంగా ఆమె ఉద్ఘాటించారు.
ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ కుమార్, డీఆర్డీవో జ్యోతి, జిల్లా అధికారులు, డీఎంఅండ్హెచ్ఓ, సీడీపీవోలతో పాటు వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


