కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (ఐడీఓసీ)లో శుక్రవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులు, శ్రమ గౌరవంపై అవగాహన కల్పించారు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉమరాణి, లైబ్రరీ చైర్మన్ మది చంద్రకాంత్ రెడ్డి, షుగర్కేన్ చైర్మన్ ఇర్షాద్ుద్దీన్, అదనపు కలెక్టర్ మధుమోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మేడే కార్మికుల త్యాగాలు, హక్కులను గుర్తు చేసే రోజు అని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని తెలిపారు. వారికి మౌలిక హక్కులు, మెరుగైన పని పరిస్థితులు, సరైన వేతనంపై అవగాహన అవసరమని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు, ఏటీసీ తాడ్వాయి శిక్షణార్థులు, మేప్మా, పరిశ్రమల శాఖ, మున్సిపల్ విభాగాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ఉత్తమ లేబర్ అధికారి అవార్డుతో పాటు పలువురికి లేబర్ డే అవార్డులను ప్రదానం చేశారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సయ్యద్ కమరుద్దీన్, ఉపాధి శాఖకు చెందిన కృప, తాడ్వాయి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపాల్ రమేష్ తదితరులు అవార్డులు అందుకున్నారు.












