మంచిర్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కార్యాలయంలోని పలు రకాల రికార్డులు, రిజిస్టర్లను ఆయన పరిశీలించి, వాటి నిర్వహణపై ఆరా తీశారు.
ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ రికార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు చేరువగా ఉండాలని, వారి సమస్యలను సానుభూతితో ఆలకించి పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సేవలు సకాలంలో, నిష్పక్షపాతంగా అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
కార్యాలయ నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు చేరువగా ఉండాలని ఆయన అన్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.











