పటాన్చెరు, జూన్ 30
అమీన్పూర్,పటాన్చెరుసర్కిళ్లపరిధిలోనిప్రతికాలనీనిఅన్నిరంగాల్లోసమగ్రఅభివృద్ధిచేయడమేలక్ష్యంగాపనిచేస్తున్నామనిపటాన్చెరుఎమ్మెల్యే ఎమ్మెల్యే గూడెంమహిపాల్రెడ్డిఅన్నారు.మంగళవారంఉదయంఅమీన్పూర్డివిజన్పరిధిలోనిప్రైడ్పార్కుకాలనీ,సన్వేఓపస్కాలనీలలోఐదుకోట్ల20లక్షలరూపాయలఅంచనావ్యయంతోచేపట్టనున్నసీసీరోడ్డు,డివైడర్,ఫుట్పాత్,మంచినీటిపైపులైన్లనిర్మాణపనులకుఆయనశంకుస్థాపనచేశారు.
అమీన్ పూర్, పటాన్ చెరు సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ప్రైడ్ పార్కు కాలనీ, సన్ వే ఓపస్ కాలనీలలో ఐదు కోట్ల 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డివైడర్, ఫుట్ పాత్, మంచినీటి పైపులైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పార్కులు, వీధి దీపాలు, మంచినీటి పైపులైన్లు వేయడంతో పాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ ను గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా, మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేయడంతో పాటు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు.
అమీన్పూర్, బీరంగూడ పరిధిలో శరవేగంగా నూతన కాలనీలు ఏర్పడుతున్నాయని.. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం డిఈ వెంకటరమణ, సీనియర్ నాయకులు ఉపేందర్, జగదీష్, రాజు, చంద్రశేఖర్, తలారి రాములు, గోపాల్, సునీత, రవి గౌడ్, మహిపాల్, కాలనీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.












