సంగారెడ్డి, జూన్ 29
టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎ.కే.ఫైసల్ వేడుకలను సంగారెడ్డిలోని ఐబీలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ, మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో సేవలందించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎ.కే.ఫైసల్ జన్మదిన వేడుకలను సంగారెడ్డిలోని ఐబీలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డికి చెందిన పైసల్ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజంలో ఉన్నారని, అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రస్తుతం బాధ్యత నిర్వహిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అన్నారు.
యూనియన్ ద్వారా జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఈ సందర్భంగా చెప్పారు. మున్ముందు కూడా పైసల్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పైసల్ కేక్ కట్ చేశారు. పలువురు జర్నలిస్టులు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా పైసల్ కు శాలువా కప్పి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మసూద్, ఇంచార్జ్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ సిద్ధీఖ్, ఎంఏ.మతీన్, అక్మల్, నజీర్, మహమ్మద్ ఆరిఫ్, పాండు, ప్రభాకర్, శ్రీను, రవి, మురళి, విల్సన్, శేఖర్, లక్ష్మణ్, బాసిత్, ఈశ్వర్, పవన్, కృష్ణ, సంతు, సాయి, సతీష్, నాగేందర్, మల్లన్న, ఆమెర్, కిషోర్, వెంకట్, ఇర్షాన్, జగత్ కృష్ణ, బాబా, తదితరులు పాల్గొన్నారు.











