సంగారెడ్డి, జూలై 8
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా వైఎస్సార్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు పార్వతి, కృష్ణ, నాగరాణి, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్ మహేంద్రా, కోశాధికారి కే. సుధాకర్ గౌడ్, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, సలహాదారులు కరణ్ జిత్ సింగ్, కార్యదర్శులు గౌలి ఈశ్వర్, శ్రీనివాస్, శ్రీశైలం, రవీందర్, మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు మానస, కార్యదర్శులు వీరమణి, శృతి గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగభూషణం, తెలంగాణ ఉద్యమకారులు నాయకులు సుభాష్, కౌర్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.