కామారెడ్డి, 2026-07-09
ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్రియల్, అమర్ల బండ గ్రామాల్లోని విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్యాడ్స్, ఫ్రూట్స్, ట్రై బెల్ట్ లు పంపిణీ చేశారు.
టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి సంపత్ గౌడ్ జన్మదినం సందర్భంగా సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామంలో విద్యార్థులకు ప్యాడ్స్, ఫ్రూట్స్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ట్రై బెల్ట్ లు అందజేశారు. అనంతరం అమర్ల బండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కలాలి చుక్క సాయ గౌడ్ మాట్లాడుతూ.. సంపత్ గౌడ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టిఆర్ఎస్ జెండా ఎగురవేసి సంపత్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
అంతకుముందు విద్యార్థులు సంపత్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్రియల్ గ్రామ ఇంచార్జి గొలుసుల లింగం, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ అధ్యక్షులు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ నాయకులు జంగంగారి సాయిలు, శివ, లక్ష్మణ్, రమేష్, అమర్ల బండ గ్రామ అధ్యక్షుడు గుండెల్లి సాయి కుమార్, పరిదిపేట దినేష్, రావణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.












