కామారెడ్డి, జూలై 1
జూలై 2న హైదరాబాద్లోని ఉప్పల్ బాగాయత్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భూపోరాట ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కామారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ గైని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు.
జూలై 2న హైదరాబాద్లోని ఉప్పల్ బాగాయత్ లో నిర్వహించనున్న భూపోరాట ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ పిలుపునిచ్చారు. ఆమె ఆదేశాల మేరకు కామారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ గైని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భూపోరాట పోస్టర్ను ఆవిష్కరించారు.
కామారెడ్డి టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాలను అనుసరించి పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు బి. వసంత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేముల బలరాం, ఉపాధ్యక్షురాలు శమంత, మైనారిటీ మహిళా అధ్యక్షురాలు అఫ్రిన్, ఇర్ఫాన్, ఫారిన్, రాజేష్, రాము, వినోద్, దానియల్, ప్రియాంక, రమేష్, ప్రమీల, శిరీష, శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.












