తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు – 2026 గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజినీర్ ఎన్. విజయలక్ష్మి, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ పి. పద్మ మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ పి. పద్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, నిబంధనలు మరియు వాటి అమలు విధానాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇంటింటికీ చెత్త సేకరణ, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేయడం వంటి అంశాలను వివరించారు.
ఆధికారులు, స్థానిక సంస్థలు మరియు ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపారు.












