కామారెడ్డి, జూలై 23
కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ఆదేశాల మేరకు, కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వనమహోత్సవంలో భాగంగా 2,000 ఈత మొక్కలను నాటారు. ఈత చెట్ల పెంపకం ద్వారా కులవృత్తికి ప్రోత్సాహంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2,000 ఈత మొక్కలను నాటారు.
ఈత చెట్ల పెంపకం ద్వారా గౌడ కులస్తులకు సంప్రదాయ కులవృత్తికి ప్రోత్సాహం లభించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో ఈత, ఖర్జూర మొక్కల నాటకం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దివ్య రవితేజ గౌడ్, టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్, గౌడ సంఘం నాయకులు మొగుళ్ల సాయిగౌడ్, పెద్ద రాజాగౌడ్, మొగుళ్ల రామాగౌడ్, ఇతర గౌడ సంఘ సభ్యులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది నరసింహులు, శరత్ చంద్ర, దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












