సంగారెడ్డి, జూలై 31
క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీ సాంకేతికత అద్భుత ఫలితాలు అందిస్తోందని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ విధానం ద్వారా రోగులకు నొప్పి, రక్తస్రావం, కోలుకునే సమయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.
రోబోటిక్ సర్జరీ సాంకేతికత క్యాన్సర్ చికిత్సలో అద్భుత ఫలితాలు అందిస్తున్నాయని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రోబోటిక్ విధానంలో అత్యంత మెరుగైన ఆపరేషన్లు నిర్వహించడంతోపాటు రోగులకు నొప్పి, రక్తస్రావం, కోలుకునే సమయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.
రోబోటిక్ విధానంలో 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్సలను నిర్వహించడం వల్ల శరీరంపై గాయాలు తక్కువ ఉంటాయని, ఏఐ సాంకేతికత, 3డి విజన్ ప్రత్యేక పరికరాల సహాయంతో క్లిష్టమైన క్యాన్సర్ చికిత్సలకు మెరుగైన వైద్యం అంది విజయవంతం చేయగలుగుతున్నామని చెప్పారు.
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్; పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, కిడ్నీ, కొలెస్ట్రాల్, ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్స్ సర్జరీ సమర్థవంతంగా ఫలితాలు ఇస్తుందని, ముఖ్యంగా నరాలను సంరక్షించడం, మూత్ర నియంత్రణ, శరీర సామర్థ్యాన్ని కాపాడడంలో ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఫైర్ ప్లే ఫ్లోరోసిన్స్ ఇమేజింగ్, సెంటినల్ లింప్ నోడ్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో క్యాన్సర్ కణాలను మరింత ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.












