నిజామాబాద్, 2026-07-28
క్షయ రహిత భారతం లక్ష్యంగా నిజామాబాద్ నగరంలోని 28వ వార్డులో టీబీఎంబీఏ–2.0 మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. రాజశ్రీ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి (డీటీసీఓ) డా. దేవి నాగేశ్వరి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. నిక్షయ్ మిత్రగా సేవలందిస్తున్న కార్పొరేటర్ మల్కాయి మహేందర్ క్షయవ్యాధి బాధితులకు ఆహార కిట్లను పంపిణీ చేశారు.
క్షయ రహిత భారతం లక్ష్యంగా నిజామాబాద్ నగరంలోని 28వ వార్డులో టీబీఎంబీఏ–2.0 మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. రాజశ్రీ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి (డీటీసీఓ) డా. దేవి నాగేశ్వరి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
క్షయ రహిత భారత నిర్మాణంలో భాగంగా నిక్షయ్ మిత్రగా సేవలందిస్తున్న 28వ వార్డు కార్పొరేటర్ మల్కాయి మహేందర్ క్షయవ్యాధి బాధితులకు అందిస్తున్న సేవలను డీఎంహెచ్ఓ, డీటీసీఓ అభినందించారు. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ యూపీహెచ్సీ సిబ్బంది కార్పొరేటర్‌ను ఘనంగా సత్కరించారు.
ప్రజలకు వారి నివాస ప్రాంతంలోనే ఛాతీ ఎక్స్-రే, ఇతర ఉచిత వైద్య పరీక్షలు వంటి ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో విశేష కృషి చేసిన కార్పొరేటర్ మల్కాయి మహేందర్, నిక్షయ్ మిత్రగా క్షయవ్యాధి బాధితులకు నాలుగు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మల్కాయి మహేందర్ డీఎంహెచ్ఓ డా. రాజశ్రీ, డీటీసీఓ డా. దేవి నాగేశ్వరిని శాలువాలతో సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో క్షయ నియంత్రణ విభాగం సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












