ప్రశ్న ఆయుధం (ప్రశ్న ఆయుధం) జూలై 27
భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పడంతో, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 3 లక్షల లోన్ అప్రూవల్ (LOC) మంజూరు చేయించారు.
భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ (సీ/ఓ నాగయ్య) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో, వైద్య సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించగా, ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుండి మూడు లక్షల రూపాయల విలువైన లోన్ అప్రూవల్ (LOC) మంజూరు చేయించారు.












