కామారెడ్డి జిల్లా పోసానిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, వేసవి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు సబ్ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యార్థులకు పలు కీలక అంశాలపై సూచనలు అందించారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ఉండటానికి 1930 టోల్ ఫ్రీ నంబర్, షీ టీమ్స్ సేవలు (8712686094) అందుబాటులో ఉన్నాయని, అత్యవసరమైతే 100కు కాల్ చేయాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పొరపాట్లు కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


