ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా, ధైర్యంగా రాయాలని బీఆర్ఎస్ నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సూచించారు. పరీక్షల సమయంలో ఆందోళనకు లోనుకాకుండా సమయపాలన పాటించాలని, ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
కష్టపడి చదివిన వారికి విజయం తప్పక లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మానసికంగా తోడ్పాటు అందించాలని గోవర్ధన్ రెడ్డి కోరారు. లక్ష్య సాధనకు క్రమశిక్షణ, ఏకాగ్రత అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
పరీక్షలను సవాల్‌గా కాకుండా అవకాశంగా తీసుకోవాలని, తద్వారా భవిష్యత్‌కు బలమైన పునాది వేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.


