ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా, ధైర్యంగా రాయాలని బీఆర్ఎస్ నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి సూచించారు. కష్టపడి చదివిన వారికి విజయం తప్పక లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాకుండా, సమయపాలన పాటిస్తూ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలని గోవర్ధన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. లక్ష్య సాధనకు క్రమశిక్షణ, ఏకాగ్రత చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని ఆయన కోరారు. పరీక్షలను ఒక సవాల్‌గా కాకుండా, భవిష్యత్తుకు బలమైన పునాది వేసే అవకాశంగా తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.


