సంగారెడ్డి, July 5
అహలైనపదలకఇల,ఇలసథలలఇవవలన,నదయోగలకఉదయోగలహీలనఅలయలనసీపీఎజలలకయదగొలలపలలజయజపభతవననహైదబదలోనఇదపకవదదనెల6ననవహనననహధననవజయవతయలనపలపన
అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాటాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాల హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు లేని ప్రతి పేద కుటుంబానికీ 120 గజాల స్థలం కేటాయించాలని, గుడిసెలు వేసుకుని నివసిస్తున్న కుటుంబాలన్నింటికీ శాశ్వత పట్టాలు ఇవ్వాలని కోరారు.
అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టా పాసుబుక్కులు జారీ చేయాలని, పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రంలో వేలాది పేద కుటుంబాలు ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న గృహ, ఉపాధి, జీవన వ్యయ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సిములు, శ్రీనివాస్, శేఖర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.












