జిల్లా ఉపాధి కార్యాలయం, మహబూబాబాద్ ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ సంస్థలో ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్ 30, 2026న జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అప్రెంటిస్ షిప్ వంటి ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి టి.రజిత తెలిపారు.
ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు SSC, ఇంటర్, డిగ్రీ, బి. ఫార్మసీ / డి ఫార్మసీ / యం ఫార్మసీ ఉత్తీర్ణత కలిగిన 18-35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులు. అపోలో ఫార్మసీ బయ్యారం మరియు హైదరాబాద్ యూనిట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, రెజ్యూమ్ లతో ఏప్రిల్ 30, 2026న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు హాజరు కావాలి. జాబ్ మేళా మహబూబాబాద్ కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో, రూమ్ నెం. 25, రెండవ అంతస్తు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము(IDOC), కురవి రోడ్ నందు జరుగుతుంది.
జిల్లా ఉపాధి అధికారి టి.రజిత మాట్లాడుతూ, అర్హులైన యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇలాంటి మేళాలు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం అపోలో ఫార్మసీ HR రఘుపతిని 82476 56356 నంబర్ లో సంప్రదించాలని సూచించారు. ఈ ప్రకటన DPRO MHBD వారిచే జారీ చేయబడింది.











