కామారెడ్డి, 2026-07-08
కృత్యాధర బోధనతో విద్యార్థులను ఆకట్టుకుని, తద్వారా గుణాత్మక విద్యను అందించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గాంధారి మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థుల ప్రగతిని పరిశీలించి, ఉపాధ్యాయుల కృత్యాధర బోధన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
కృత్యాధర బోధనతో విద్యార్థులను ఆకట్టుకుని తద్వారా గుణాత్మక విద్య అందించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గాంధారి మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి, విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు.
పాఠశాలలో అవలంబిస్తున్న కృత్యాధర బోధన, ఆటపాటల ద్వారా విద్యను నేర్పించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను అదనంగా డిప్యూటేషన్ పద్ధతిలో సర్దుబాటు చేయాలని ఆయన జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని ఆయన సూచించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఇద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో మల్లికార్జున్, ఎంఈవో శ్రీహరి, స్థానిక సర్పంచ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











