కామారెడ్డి, 2026-07-06
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి నుండి భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలకు రోజూ వస్తున్న 15 మంది విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పించడంలో ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ కీలక పాత్ర పోషించారు. గ్రామస్తుల సహకారంతో ఈ ఏర్పాటు జరిగింది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామం నుండి భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలకు వస్తున్న 15 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ చొరవతో ఆటో సౌకర్యం కల్పించారు. లింగంపల్లి గ్రామస్తుల సహకారంతో, ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ సార్ గారు గ్రామస్తులతో మాట్లాడి, వారి సహకారంతో ఆటో ఏర్పాటు చేశారు.
ఈ ఆటో ఏర్పాటుతో లింగంపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య రమేష్, ఉప సర్పంచ్ గంగాధర్, భూంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామ ఉపసర్పంచ్ రాజయ్య, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు ఎంతగానో ప్రోత్సహించారు.
భూంపల్లి పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు, లింగంపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు, గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఉమాదేవి, ముత్తన్న, హైమావతి, మాలతి, చింతల లింగం పాల్గొన్నారు.











