ఒంటిమిట్టలోని హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఒక ఘటనలో, ఒక పత్రికా విలేకరి నాలుకను ఒక మహిళ కొరికినట్లు నివేదించబడింది. ఈ సంఘటనతో విలేకరి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
కర్బూజ వ్యాపారం చేసే విలేకరి రవిబాబు, ఆటో డ్రైవర్ హరికి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం వీరి ముగ్గురూ కలిసి ఒంటిమిట్టలోని హరిత హోటల్‌కు వెళ్లారు. హోటల్ సిబ్బంది మొదట అడ్డుకున్నప్పటికీ, విలేకరి తన పలుకుబడిని ఉపయోగించి లోపలికి వెళ్లినట్లు సమాచారం.
గదిలో మద్యం సేవించిన తర్వాత, సన్నిహిత సన్నివేశంలో సదరు మహిళ విలేకరి నాలుకను బలంగా కొరికింది. ఈ దాడిలో విలేకరికి తీవ్ర గాయాలై, ర....క్తస్రావం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో భయపడిన విలేకరి వెంటనే స్థానిక PHCకి వెళ్లారు.
PHC వైద్యులు పరిస్థితిని సమీక్షించి, అతడిని 108 అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. ఈలోగా, ఆటో డ్రైవర్ సదరు మహిళను రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నారు. వివాదాస్పద సంఘటనలకు కేంద్రంగా మారుతున్న హరిత హోటల్ మేనేజర్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేసినట్లు సమాచారం.











