కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 135 దరఖాస్తులు స్వీకరించారు. వీటిపై తక్షణ చర్యలు తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ప్రజలు తమ వివిధ సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు.
సమర్పించిన దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, వాటిపై వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వర పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మదన్ మోహన్, సీఈఓ, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.








