హకీంపేట్ బస్ డిపో పరిధిలో ఉషార్పల్లి గ్రామం నుండి సికింద్రాబాద్ వరకు సర్వీస్ నెంబర్ 120 గా నూతన బస్సు సర్వీస్ శనివారం ప్రారంభమైంది. ఈ సర్వీస్ ప్రారంభోత్సవంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ బస్సును ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వీస్ ద్వారా ఉషార్పల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు సికింద్రాబాద్కు తక్కువ సమయంలో సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది.
ఈ నూతన బస్సు సర్వీస్ వల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడంతో పాటు, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, పలువురు ప్రముఖ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బస్సు సర్వీస్ నిర్దిష్ట సమయాలలో నడుస్తుందని అధికారులు తెలిపారు.











