కామారెడ్డి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలలో భాగంగా, స్థానిక ఆర్.కె. విద్యాసంస్థల సీఈఓ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి పాట్రన్ మెంబర్గా, ఎం. సదాశివ రెడ్డి వైస్ పాట్రన్ సభ్యుడిగా చేరారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వీరిని సత్కరించి, సభ్యత్వ పత్రాలను అందజేశారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో రూ.25,000 సభ్యత్వంతో పాట్రన్ మెంబర్గా చేరిన డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డిని, రూ.12,000 సభ్యత్వంతో వైస్ పాట్రన్ మెంబర్గా చేరిన ఎం. సదాశివ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జైపాల్ రెడ్డికి సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్ని, ఎం. సదాశివ రెడ్డికి మెమెంటోను అందజేశారు.
సమాజ సేవలో ముందుండే డాక్టర్ జైపాల్ రెడ్డి వంటి వ్యక్తులు రెడ్ క్రాస్ వంటి సంస్థలలో సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. యువత కూడా రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని, తమ విలువైన సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి, సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
తాను రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందని డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి తెలిపారు. దీనికి అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలోని ప్రముఖులు, యువత, విద్యార్థులు కూడా రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ACLB గిరి, రెడ్ క్రాస్ నోడల్ అధికారి శశికుమార్, దత్తాద్రి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.












