నిజామాబాద్, 2026
జేసీఐ ఇండియా జోన్–12 ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన 'తేజస్ మిడ్కాన్–2026' (మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్)లో జేసీఐ ఇందూర్ పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఏడాది పొడవునా నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా వివిధ విభాగాల్లో ఈ అవార్డులు లభించాయి.

సంక్రాంతి వేడుకలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు, ఉచిత పుస్తకాల పంపిణీ, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, డ్యాన్స్ ఫెస్ట్తో పాటు ఇతర సేవా కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు జేసీఐ ఇందూర్కు ఈ పురస్కారాలు దక్కాయి. రీజియన్–సి ఉపాధ్యక్షుడు జయంత్ శెట్టి అవార్డులను అందజేశారు.
వ్యక్తిగత అవార్డుల విభాగంలో ఉత్తమ అధ్యక్షుడిగా జైపాల్ కాలే, ఉత్తమ కార్యదర్శిగా తేజస్వి తిరునగరి ఎంపికయ్యారు. సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించిన పూర్వ అధ్యక్షుడు నయన్ జిల్కార్, పూర్వ జోన్ ఉపాధ్యక్షుడు జేసీఐ సెనేటర్ విజయానంద్ జిల్కార్లను ప్రత్యేక అవార్డులతో సత్కరించారు.
జేసీఐ ఇందూర్ తరఫున జోన్ అధికారి నయన్ జిల్కార్ అవార్డులను స్వీకరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నిపుణ్తో పాటు జోన్ అధికారులు, రీజియన్–ఏ, బీ, సీకి చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవార్డుల సాధనకు సహకరించిన జోన్ అధికారులకు, పూర్వ అధ్యక్షులకు, సభ్యులకు జేసీఐ ఇందూర్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవలో ముందంజలో నిలుస్తామని పేర్కొన్నారు.