నిజామాబాద్, జూలై 11
నగరంలోని టౌన్-3 పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరంలోని టౌన్-3 పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న కమిషనర్, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను వెంటనే పరిశీలించి, నిందితులను గుర్తించి త్వరితగతిన అరెస్టు చేయాలని సూచించారు.
ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, నిందితుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
కమిషనర్ వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్ఐ హరిబాబు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.










