ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు.
ఈ జాబ్ మేళా ద్వారా ఇంటర్మీడియేట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హతలు కలిగిన యువతకు మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి.
జిల్లా యువజన, క్రీడల శాఖ, ఇండస్ట్రీస్ & కామర్స్ డిపార్ట్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ITE&C) శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అభ్యర్థుల కోసం మే 7, 2026న నిజామాబాద్‌లోని శ్రీరామ గార్డెన్స్ (ఆర్మూర్ రోడ్)లో జాబ్ మేళా జరగనుంది.
సుమారు 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా QR కోడ్ స్కాన్ చేసి ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అదనపు వివరాల కోసం జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయాన్ని లేదా 9440846682, 9618126053 నంబర్లను సంప్రదించవచ్చు.












