జగద్గిరిగుట్టలోని కాకతీయ టెక్నో స్కూల్ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ సంవత్సరం 583 మార్కులు సాధించి దొగిపర్తి దేదీప్య అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించింది.
పదవ తరగతి పరీక్షల్లో ఎప్పుడూ ముందుండే కాకతీయ టెక్నో స్కూల్ ఈసారి తన చరిత్రలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని అందించింది. దొగిపర్తి దేదీప్య 583 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, పద్దాని వెన్నెల 561 మార్కులతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
పాఠశాల డైరెక్టర్లు మరియు ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల అద్భుత విజయానికి అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం కీలకమని తెలిపారు. అందరి సమష్టి కృషితోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని, ఇది పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. పూర్తిస్థాయి ఉత్తీర్ణత శాతం సాధించినందుకు విద్యార్థులకు, అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ మరియు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.











