ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఉద్యోగ మేళా విజయవంతమైంది. ఈ మేళాలో 462 మంది యువతకు ఉద్యోగాలు లభించాయి.
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, "ఉద్యోగ సాధన – ప్రతిభకు అవకాశాల అనుసంధానం" అనే పేరుతో నిజామాబాద్‌లో మే 7, 2026న ఒక సంయుక్త జిల్లా ఉద్యోగ మేళా నిర్వహించబడింది. ఈ మేళాకు 2,196 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 1,256 మంది హాజరయ్యారు.
మొత్తం 71 కంపెనీలు ఈ మేళాలో పాల్గొని, సుమారు 5,500 ఉద్యోగ ఖాళీలను అందుబాటులో ఉంచాయి. ఎంపిక ప్రక్రియలో 793 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ కాగా, వీరిలో 462 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో 52 మంది అదనంగా ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంపికైన అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, జీఎం ఇండస్ట్రీస్ ప్రతినిధి శ్రీ లాలు నాయక్, యువజన సర్వీసుల శాఖ, ఇండస్ట్రీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.












