శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాలలో 11 మంది విద్యార్థులకు సామూహిక ఉపనయన కార్యక్రమం బ్రహ్మశ్రీ డాక్టర్ శీర్లవంచ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది.
వేద బ్రాహ్మణుల సమక్షంలో, తల్లిదండ్రుల ఆశీస్సులతో గాయత్రీ ధారణతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ ఉపనయనం ఒక ముఖ్యమైన ఘట్టం.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రాజు పాటిల్, శ్రీ బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంగయ్య ఆచారి, డాక్టర్ దేవేందర్ చారి, లక్ష్మీపతి ఆచారి, పురోహితులు లింగమాచారి, రవికుమార్ ఆచారి, శరత్ ఆచారి, కాలనీవాసులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వేద సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని, వేద విద్యార్థులకు ఉపనయనం ద్వీజత్వంలోకి ప్రవేశానికి మార్గమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల వేద పరిజ్ఞానాన్ని అందించడంలో కృషి చేస్తోంది.

