కామారెడ్డి పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో ఒక నిందితుడిని బ్లూ కోర్ట్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 8వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఘటనలో, స్టేషన్ రోడ్డులో పహారా కాస్తున్న బ్లూ కోర్ట్–1 సిబ్బంది, నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కొని పారిపోతున్న నిందితుడిని గుర్తించారు.
పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద ఉన్న బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై ఎస్హెచ్ఓ నరహరి వివరాలు వెల్లడించారు. నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ అరెస్ట్ తో పట్టణంలో కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.


